Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల మృతి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 19, 2026 7:06 PM అమరావతిGeneral
సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల మృతి - Udayam
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన తొమ్మిది మందిలో ముగ్గురు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో అరవింద్ (23), శ్రీరామ్ (17) మృతదేహాలు లభించాయి. మరో యువకుడు సాయి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఉద్యోగాల నిమిత్తం బయట ప్రాంతాల్లో ఉంటున్న వీరు సెలవులకు స్వగ్రామానికి వచ్చిన సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Comments

G
Loading comments...