Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెలలోగా విద్యార్థులందరికీ రెండు యూనిఫాంలు: సీఎస్ ఆదేశం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 24, 2026 9:17 PM హైదరాబాద్General
నెలలోగా విద్యార్థులందరికీ రెండు యూనిఫాంలు: సీఎస్ ఆదేశం - Udayam
రాష్ట్రంలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రతి విద్యార్థికి నెలరోజుల్లోగా రెండు యూనిఫాంలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. యూనిఫాంల నాణ్యతపై రాజీ పడొద్దని, విద్యార్థుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 27% వర్షపాతం లోటు నమోదైన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని కూడా అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...