Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుక్కుతో రెండు రేసింగ్‌ ఈవీల తయారీ

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 20, 2026 8:56 AM జాతీయంGeneral
తుక్కుతో రెండు రేసింగ్‌ ఈవీల తయారీ - Udayam
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ విద్యార్థులు తుక్కు సామాన్లతో రెండు రేసింగ్ విద్యుత్తు కార్లను తయారు చేశారు. పాత ఇనుప ముక్కలు, సైకిల్ భాగాలను ఉపయోగించి 60 మంది విద్యార్థులు కేవలం రూ.18 వేల ఖర్చుతో వీటిని రూపొందించారు. ఈ ఈవీ కార్లు ఒకసారి ఛార్జ్ చేస్తే గంటకు 35 కిలోమీటర్ల వేగంతో 70 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఈ సెంటర్‌లో శిక్షణ పొందిన 300 మంది ఇప్పటికే పలు ఉద్యోగాలు సాధించారని డైరెక్టర్ వాఘ్మారే తెలిపారు.

Comments

G
Loading comments...