వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని కేయూసీ, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.25 లక్షల విలువైన 28 చోరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాలకు చెందిన నిందితులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో అనుమానం రావడంతో విచారించగా చోరీల వివరాలు బయటపడ్డాయని వెల్లడించారు.
Comments
Loading comments...

