Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసుపు, అల్లం సాగుకు ‘రైజోమ్ ప్లాంటర్’కు పేటెంట్

Follow Udayam Digital on Google
పసుపు, అల్లం సాగుకు ‘రైజోమ్ ప్లాంటర్’కు పేటెంట్ - Udayam Digital
చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన ట్రాక్టర్‌ ఆధారిత ‘రైజోమ్ ప్లాంటర్’కు భారత ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. పసుపు, అల్లం సాగులో కూలీల కొరత తగ్గించి, తక్కువ సమయంలో క్రమపద్ధతిలో విత్తనం నాటేందుకు ఈ యంత్రం ఉపయోగపడనుంది. ఈ యంత్రంతో కూలీల అవసరం, సాగు ఖర్చులు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. మొక్కల పెరుగుదల, దిగుబడులు మెరుగుపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Comments

G
Loading comments...