వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లి మండలంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు, నాయకులు మహా ధర్నా, ముట్టడి నిర్వహించారు. లోవోల్టేజీ, అప్రకటిత విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్పందించిన విద్యుత్ శాఖ డీఈ మండలంలోని అన్ని గ్రామాలకు రోజుకు 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

