వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో మాచవరం మండలంలో వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్ శాఖ ఏఈ శంకర్రావు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోతే వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.
మాచవరం సబ్‌స్టేషన్‌లో అన్ని గ్రామాలకు చెందిన ఎల్‌ఐ, ఎల్ఎం, జేఎల్ఎంలు, వర్కర్లను అందుబాటులో ఉంచినట్లు ఏఈ తెలిపారు. విద్యుత్ స్తంభాలను ఎవరూ తాకవద్దని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

