వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం శైవక్షేత్రం సమీపంలో కృష్ణానది తీరానికి ఒక మొసలి రావడంతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నదిలో విద్యుత్ హైటెన్షన్ టవర్ పనుల్లో నిమగ్నమైన కార్మికులు ఈ మొసలిని ప్రతీక్షంగా చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నది ఒడ్డున కొద్దిసేపు అలజడి సృష్టించిన ఆ మొసలి, ఆ తర్వాత తిరిగి నీటిలోకి ఈదుకుంటూ వెళ్లిపోయింది. సోమవారం జరిగిన ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
Comments
Loading comments...

