వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ జ్ఞానప్రసాద్ అన్నారు. రామభద్రపురం మండల కేంద్రంలో సోమవారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు, గంజాయి వలన అనర్థాలపై అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారణకు సహకరించాలని వాహనదారులు, ఆటో డ్రైవర్లను కోరారు. గంజాయి, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

