Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టొరంటోలో వేధింపుల ఆరోపణలు.. డ్రైవర్ అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:08 PM అంతర్జాతీయంGeneral
టొరంటోలో వేధింపుల ఆరోపణలు.. డ్రైవర్ అరెస్ట్ - Udayam
కెనడాలోని టొరంటోలో మహిళా ప్రయాణికురాలిని వేధించి, వాహనంలో నిర్బంధించినట్లు ఆరోపణలు రావడంతో రైడ్‌ షేరింగ్‌ డ్రైవర్ సాహిబ్ బరార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 31న రాత్రి 9.50 గంటలకు యోంగ్ స్ట్రీట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళ వాహనం దిగేందుకు ప్రయత్నించగా డ్రైవర్ అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...