‘టన్నెల్ మెన్’లో టబు?

టబు ఓటీటీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘టన్నెల్ మెన్’ సిరీస్‌లో ఆమె నటించనున్నట్లు సమాచారం.
‘ది రైల్వే మెన్’ ఫేమ్ శివ్ రావెల్ ఈ సిరీస్‌కు షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారట. 2023 ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా కల్పిత డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...
