Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ సీనియర్ నేత మృతి

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:15 PM కృష్ణా జిల్లాGeneral
టీడీపీ సీనియర్ నేత మృతి - Udayam
వేలేరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు దొనవల్లి బాపారావు (85) కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పలు పదవుల్లో సేవలందించిన బాపారావు గ్రామ అభివృద్ధికి కృషి చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...