Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేకుమట్ల మండలానికి పదేళ్లు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 5:59 PM జయ శంకర్ భూపాలపల్లి General
టేకుమట్ల మండలానికి పదేళ్లు - Udayam
టేకుమట్ల మండలం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం దశాబ్ది వేడుకలు నిర్వహించారు. తహశీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్‌లో అధికారులు, సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏర్పాటైన టేకుమట్ల మండలం ప్రజలకు పరిపాలనను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు,ఇతర నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...