వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి మండలం దారకొండలో రోగులు, గర్భిణులను ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలకు దూరమైందని స్థానికులు తెలిపారు. మారుమూల గ్రామాలు అధికంగా ఉండటంతో ఈ సేవలు ప్రజలకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అంబులెన్స్ టైర్లు అరిగిపోవడంతో సేవలకు దూరమైందని తెలిపారు. టైర్ల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు నివేదించినట్లు స్థానిక వైద్యాధికారి బాబ్జీ బుధవారం తెలిపారు.
Comments
Loading comments...

