Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో ఒప్పందానికి ట్రంప్ బ్రేక్

Follow Udayam on Google
Suman Kumar May 30, 2026 10:24 AM జాతీయంGeneral
ఇరాన్‌తో ఒప్పందానికి ట్రంప్ బ్రేక్ - Udayam
ఇరాన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. వైట్‌హౌస్‌లో సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ, ఈ డీల్ వల్ల అమెరికాకు పూర్తి ప్రయోజనం చేకూరాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. మరోవైపు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఇరాన్‌తో మళ్లీ యుద్ధం చేయడానికి తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని, ఆయుధ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రకటించారు. దీంతో అక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...