వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, ఆయన అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లక్ష్మీ దాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

