వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న పలు బస్తీలు చెత్తకుప్పలుగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంజయ్య నగర్ డివిజన్ రాజీవ్ వడ్డెర బస్తీ నుండి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లే దారి మొత్తం వ్యర్థాలతో నిండి దుర్వాసన వెదజల్లుతోంది.
పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, స్వచ్ఛ హైదరాబాద్ నినాదం మాటలకే పరిమితమైందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

