Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో ముగ్గురు ఏపీ వాసులు మృతి

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 12:12 PM జాతీయంGeneral
బెంగళూరులో ముగ్గురు ఏపీ వాసులు మృతి - Udayam
బెంగళూరు రూరల్‌ జిల్లా దొడ్డబళ్లాపుర రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొని హిందూపురానికి చెందిన మహిళ, ఇద్దరు బాలికలు మృతిచెందారు. మృతులను ఇర్ఫాన్ (46), రుకియా (13), రాకియా (8)గా పోలీసులు గుర్తించారు. బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...