వార్తలకు తిరిగి వెళ్లండి
రైలు ఢీకొని అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్మరణం

శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.నవ్య (24) కర్ణాటకలోని తమకూరులో రైలు ప్రమాదంలో మృతి చెందారు. బెంగళూరు సప్తగిరి వర్సిటీలో పనిచేసే ఆమె ప్లాట్‌ఫామ్ దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
విధులకు వెళ్లేందుకు రైలు ఎక్కే సమయంలో వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యంగ్ ప్రొఫెసర్ అకాల మరణంతో స్వగ్రామమైన గుడిబండలో తీవ్ర విషాదం అలముకుంది.
Comments
Loading comments...