Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24.43 బిలియన్‌ స్పామ్‌ కాల్స్‌, SMSలను గుర్తించిన TRAI

Follow Udayam on Google
రచన దేవి Aug 04, 2026 6:58 PM జాతీయంGeneral
24.43 బిలియన్‌ స్పామ్‌ కాల్స్‌, SMSలను గుర్తించిన TRAI - Udayam
2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 24.43 బిలియన్‌ అనుమానాస్పద స్పామ్‌ కాల్స్‌, SMSలను ఏఐ ద్వారా గుర్తించినట్లు TRAI తెలిపింది. ఏప్రిల్‌-జూన్‌ మధ్య 10.8 లక్షల స్పామ్‌ ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించింది. 1.83 లక్షల టెలికాం వనరులను నిలిపివేయగా, 2,873 SMS హెడర్లను బ్లాక్‌ చేసింది. DND యాప్‌ ద్వారా 148 కోట్ల ప్రమోషనల్‌ కాల్స్‌, 730 కోట్ల SMSలు అడ్డుకున్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...