Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు రైతులకు నేటి నుంచి ఆర్థిక సాయం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 06, 2026 6:59 AM అమరావతిGeneral
పొగాకు రైతులకు నేటి నుంచి ఆర్థిక సాయం - Udayam
లోగ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.10 చొప్పున ఆర్థిక సాయాన్ని నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. దాదాపు 100 మిలియన్ కిలోల అధిక ఉత్పత్తికి రూ.100 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పొగాకు బోర్డు పరిధిలో లేని కౌలు రైతులకు రెండేళ్ల వెసులుబాటుతో వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు తెలిపారు. అధిక ఉత్పత్తితో ధరలు తగ్గడంతో రైతులకు అండగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు.

Comments

G
Loading comments...