వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మార్కండేయ దేవస్థానంలోని వినాయక మండపంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో లడ్డూ వేలం నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొనగా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు మచ్చ శ్రీనివాస్ రూ.25,116కు లడ్డూను దక్కించుకున్నారు.
అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మోర లక్ష్మీరాజం సంఘం నాయకులు భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

