Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంబిగానిపల్లి వద్ద ఏటీఎంలో చోరీ యత్నం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:10 AM చిత్తూరుGeneral
తంబిగానిపల్లి వద్ద ఏటీఎంలో చోరీ యత్నం - Udayam
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఇండియా-1 ఏటీఎంలో అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. సమీపంలోని కొందరు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. ఏటీఎంలో ఎంత నగదు ఉందో, చోరీకి గురైందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...