Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ ధరకు ఇసుక కొని.. అధిక ధరకు విక్రయం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 23, 2026 9:44 AM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
తక్కువ ధరకు ఇసుక కొని.. అధిక ధరకు విక్రయం - Udayam
రామంతపూర్‌లోని శ్రీ చైతన్య హైస్కూల్ ఎదురుగా బిల్లులు లేకుండా నిల్వ చేసిన సుమారు 15 టన్నుల ఇసుకను ఉప్పల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు మహమ్మద్ బురాన్ అలియాస్ జిల్లు (44)ను అదుపులోకి తీసుకున్నారు. తక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించేందుకు నిల్వ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...