వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పెరటాసి మాసం, వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజుకు సుమారు 80 వేల మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నా, మరో 30 వేల మంది నిరీక్షిస్తున్నారు.
రద్దీ దృష్ట్యా అక్టోబర్ 1, 5న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 4న సిఫార్సు లేఖలు స్వీకరించరు. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
Comments
Loading comments...

