Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల బుకింగ్స్.. మధ్యవర్తులను నమ్మొద్దు

Follow Udayam on Google
మానస శర్మ Jul 16, 2026 7:40 AM తిరుపతిGeneral
తిరుమల బుకింగ్స్.. మధ్యవర్తులను నమ్మొద్దు - Udayam
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, ఆర్జిత సేవల బుకింగ్‌ల కోసం భక్తులు కేవలం తితిదే అధికారిక వెబ్‌సైట్నే వినియోగించాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. అనధికారిక వెబ్‌సైట్లు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచించారు. సందేహాల కోసం కాల్ సెంటర్ నంబరు 155257ను, మోసాలకు గురైతే విజిలెన్స్ విభాగం నంబరు 98668 98630ను సంప్రదించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...