వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెద్దపులి కలకలం రేపింది. కావడిగుండ్ల గ్రామంలో మేత మేస్తున్న ఎద్దుపై దాడికి పులి ప్రయత్నించడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అటవీ అధికారులు పులి పాదముద్రలను పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పులి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి.
Comments
Loading comments...

