వార్తలకు తిరిగి వెళ్లండి

జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో పులి దాడిలో గేదె దూడ మృతి చెందింది. రైతు దుద్దుపూడి రాజేంద్రప్రసాద్‌కు చెందిన దూడపై శనివారం రాత్రి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
పులిని సురక్షితంగా బంధించేందుకు పుణె నుంచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు జిల్లా అటవీశాఖాధికారి సందీప్‌రెడ్డి తెలిపారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

