వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఓ పాము ప్రత్యక్షమై అధికారులను హడలెత్తించింది. గిర్దావర్ గదిలోకి ప్రవేశించిన తాటి జెర్రీ పాము, అక్కడి బీరువా వెనుక నక్కి కూర్చుంది. భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
అది ఎంతకూ బయటకు రాకపోవడంతో, చివరకు స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. ఆయన సమయస్ఫూర్తితో పామును పట్టుకుని అడవిలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు నిశ్చింతగా విధుల్లో చేరారు.
Comments
Loading comments...

