వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దిగువ ట్రోపో ఆవరణంలో గాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Comments
Loading comments...

