వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం వద్ద శనివారం ఉదయం 5 గంటలకు గోదావరి నీటిమట్టం 54.80 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నదిలో 15,21,335 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు.
Comments
Loading comments...

