వార్తలకు తిరిగి వెళ్లండి

కోటపల్లి మండలం కావర్ కొత్తపల్లిలో పట్టుపురుగుల పెంపకం విషయంలో గిరిజన రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య నాలుగు రోజులుగా ఉద్రిక్తత నెలకొంది. టైగర్ జోన్ పరిధిలో ప్రవేశించవద్దని అధికారులు అడ్డుకోవడంతో వివాదం ఏర్పడింది.
పట్టుపురుగుల పెంపకమే తమ జీవనాధారమని రైతులు చెబుతుండగా, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ హెచ్చరిస్తోంది. గతేడాది కూడా ఇదే అంశంపై వివాదం చోటుచేసుకుంది.
Comments
Loading comments...

