వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి పట్టణ సుందరీకరణలో భాగంగా ఆటోనగర్ నుంచి వీఎస్‌ఆర్ కళాశాల వరకు జరుగుతున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు పరిశీలించారు. సెంట్రల్ లైటింగ్, డివైడర్ల రంగుల పనులను తనిఖీ చేసి, రోడ్డు మార్జిన్లలో చెత్తను తొలగించాలని ఆదేశించారు.
పట్టణ ముఖద్వారం వద్ద 'మన తెనాలి' ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్‌అండ్‌బీ డీఈ రాజేంద్రనాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

