వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి అక్రమ రవాణా కేసులో ఏ-2 నిందితుడు నరసయ్యకు ఏలూరు ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.
2019లో జీలుగుమిల్లి పోలీసులు రెండు కార్లలో 194 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోర్టు నుంచి పరారైన నరసయ్యను తెలంగాణలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Comments
Loading comments...

