Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయాల చోరీ కేసులు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 01, 2026 2:35 PM కరీంనగర్General
దేవాలయాల చోరీ కేసులు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్ - Udayam
రామడుగు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల రెండు దేవాలయాల్లో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఎంఏ హర్షద్‌ ఖాన్ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి మూడు వెండి కిరీటాలు, నాలుగు వెండి జంజీరాలు సహా ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...