Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు ప్రజలే నాకు రాజకీయ భిక్ష పెట్టారు: చంద్రబాబు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 4:13 PM బాపట్లGeneral
తెలుగు ప్రజలే నాకు రాజకీయ భిక్ష పెట్టారు: చంద్రబాబు - Udayam
బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సీఎం పదవి తనకు కొత్త కాదని, తెలుగు ప్రజలే తనకు రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. కష్టాలు ఎదురైనప్పుడు పారిపోకుండా పోరాడుతానని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...