వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటేనని వారు ఆకాంక్షించారు.
రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలని, హైదరాబాద్, అమరావతి నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా వెలగాలని చంద్రబాబు పేర్కొన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంలో రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలన్నారు. యువత బలిదానాలు, కోట్ల మంది ఆకాంక్షలతో సిద్ధించిన గడ్డ తెలంగాణ అని పవన్ కల్యాణ్ కొనియాడారు.
Comments
Loading comments...

