వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసుల సేవలను భారత రాయబారి విపుల్ ప్రశంసించారు. గల్ఫ్ ప్రాంతంలోని తెలుగు ప్రవాసులు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ వారి సేవలను కొనియాడారు.
రియాద్‌లో తెలుగు ప్రవాసీ సంఘం సాటా ఆధ్వర్యంలో బుధవారం తెలుగు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విపుల్ హాజరయ్యారు.
Comments
Loading comments...

