Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నీటిని ఏపీకి తరలిస్తుంటే మౌనం: మాజీ మంత్రి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 9:30 AM మహబూబ్‌నగర్General
కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణ నీటిని ఏపీకి తరలిస్తున్నా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు ఎవరి దందాలో వారు ఉన్నారని విమర్శించారు. తెలంగాణ నీటిని పక్క రాష్ట్రాలకు తరలిస్తే రైతులకు నష్టం జరుగుతుందని అన్నారు. నీళ్లు అందితే పంటలు పండుతాయని, పంటలకు మద్దతు, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...