వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని లూసియానాలో నల్గొండ జిల్లాకు చెందిన అనురూప్ రెడ్డి అనే తెలుగు యువకుడు మృతి చెందాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన స్నేహితులను కాపాడిన అనురూప్.. ఆ తర్వాత నీటిలో మునిగిపోయాడు.
కాలుకు చేపల వల చిక్కుకోవడమే అతడి మృతికి కారణమని పోలీసులు తెలిపారు. రెస్క్యూ టీమ్ 20 అడుగుల లోతు నుండి అతడి మృతదేహాన్ని వెలికితీసింది. ప్రస్తుతం అతడి కుటుంబం హైదరాబాద్‌లో ఉంటోంది.
Comments
Loading comments...

