వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో త్వరలో వర్షాలు కురవనున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉంది.
నాగర్‌కర్నూల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

