వార్తలకు తిరిగి వెళ్లండి
ఈసీకి 'తెలంగాణ రక్షణ సేన' లేఖ

తమ పార్టీ రిజిస్ట్రేషన్‌పై వచ్చిన వెయ్యి అభ్యంతరాల కాపీలను అందించాలని తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) కోరారు. ఆ వివరాలు లేకుండా తాము సమాధానం చెప్పలేమన్నారు.
ఇప్పటికే 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేశామని, ఇప్పుడు పేరు మార్చమనడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద తమ పార్టీ దరఖాస్తును పరిశీలించి, వెంటనే ఆమోదించాలని ఆయన ఈసీకి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...