Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు!

Follow Udayam on Google
Nidhi Razdan May 19, 2026 10:48 AM హైదరాబాద్General
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు! - Udayam
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు (పదేళ్లు) పెంచుతూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. నిరుద్యోగుల వినతుల మేరకు ఏడాది పాటు ఈ సడలింపు అమలులో ఉంటుంది. వివిధ నియామక సంస్థలు ఇచ్చే నోటిఫికేషన్లకు ఇది వర్తిస్తుంది. అయితే పోలీస్, ఎక్సైజ్, ఫైర్ వంటి యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకు మాత్రం ఈ వయోపరిమితి పెంపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...