Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘X’ ఖాతా హ్యాక్

Follow Udayam on Google
Rohit Awasthi Jun 09, 2026 3:46 PM హైదరాబాద్General
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘X’ ఖాతా హ్యాక్ - Udayam
రాష్ట్రంలో డిజిటల్ భద్రతను పర్యవేక్షించే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCB) అధికారిక 'X' (ట్విట్టర్) అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. మే 22న సైబర్ నేరగాళ్లు ఈ ఖాతాను హ్యాక్ చేయగా, దాదాపు 20 రోజులు గడుస్తున్నా అధికారులు ఈ విషయాన్ని గుర్తించకపోవడం గమనార్హం. ఒకప్పుడు దేశంలోనే నంబర్ వన్ సైబర్ సెక్యూరిటీ సంస్థగా ప్రశంసలు అందుకున్న బ్యూరో, తన స్వంత ఖాతా భద్రతపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రస్తుతం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...