Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తబల, తాళాలతో వినాయకుడి ఆగమనం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:46 AM కామరెడ్డిGeneral
తబల, తాళాలతో వినాయకుడి ఆగమనం - Udayam
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్‌లో గణేశుడి ఆగమనాన్ని నిర్వాహకులు వినూత్నంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన భక్తులు నృత్యాలు చేస్తూ తబల, తాళాలతో వినాయకుడిని ప్రధాన వీధుల గుండా ఊరేగించి మండపానికి ఆహ్వానించారు. తరాలు మారుతున్నా నాటి ఆచారాలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నవరాత్రుల్లో లంబోదరుడికి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...