Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు సీఎం విజయ్‌కు హైకోర్టులో ఊరట

Follow Udayam on Google
Rohit Singh Jun 02, 2026 4:08 PM జాతీయంGeneral
తమిళనాడు సీఎం విజయ్‌కు హైకోర్టులో ఊరట - Udayam
ఆదాయ వివరాలు దాచిపెట్టారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్‌ల డివిజన్ బెంచ్.. పిటిషనర్ తన అభ్యర్థనను వెనక్కి తీసుకోవడంతో కేసును కొట్టివేసింది. గతంలో 'పులి' సినిమా రెమ్యునరేషన్ సోదాల ఆధారంగా విజయ్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. అయితే, పిటిషన్ ఉపసంహరణకు కోర్టు అనుమతించడంతో సీఎం విజయ్‌కు పెద్ద ఉపశమనం లభించింది.

Comments

G
Loading comments...