వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తి పేరుతో పట్టా జారీ కావడం కలకలం రేపింది. 4.25 ఎకరాలకు వహీదా బేగం పేరుతో పట్టా పాసుపుస్తకం జారీ కాగా, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.
భూమి విలువ సుమారు రూ.50 కోట్లుగా అంచనా. రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయన్నదానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. పట్టా రద్దుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

