Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​తాండూరులో నేడు మాంసం విక్రయాలు బంద్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 4:31 PM వికారాబాద్General
​తాండూరులో నేడు మాంసం విక్రయాలు బంద్ - Udayam
​శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తాండూరు పట్టణంలో శుక్రవారం మాంసం విక్రయాలపై పూర్తి నిషేధం విధించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణంలోని మటన్, చికెన్, చేపల దుకాణాలు, కబేళాలతో పాటు హోటళ్లలోనూ మాంసాహారం విక్రయించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...