Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తామర పూల కోసం వెళ్లి ఇద్దరు బాలురి మృతి

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 1:00 PM అమరావతిGeneral
తామర పూల కోసం వెళ్లి ఇద్దరు బాలురి మృతి - Udayam
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో తామర పూల కోసం చెరువులోకి దిగిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కొలకలూరి నిశాంత్‌ (12), నాగచైతన్య ఆరో తరగతి చదువుతున్నారు. దసరా సెలవుల్లో ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లి నీటిలో మునిగిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు చెరువులో ఓ బాలుడి తలను గుర్తించి బయటకు తీశారు. అతడి చేయి పట్టుకుని ఉన్న మరో బాలుడి మృతదేహం కూడా లభ్యమైంది.

Comments

G
Loading comments...