వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలం తాళ్లపేటలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ గ్రామం మీదుగా మంచిర్యాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు బస్సులు రాకపోకలు సాగిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు.
బస్సుల కోసం ఎండలోనే వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి షెల్టర్ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

